Telangana: తెలంగాణ కాంగ్రెస్ లో ‘డీసీసీ’ సెగలు.. పార్టీ పదవులకు ఎమ్మెల్యే రేగ రాజీనామా!

  • పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు మనస్తాపం
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ ఇన్ చార్జి బాధ్యతలకు గుడ్ బై
  • డీసీసీ నియామకంపై తనను సంప్రదించలేదని ఆవేదన
తెలంగాణలోని 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తమను సంప్రదించకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ చీఫ్ ను నియమించడంపై పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు మనస్తాపం చెందారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ పదవులకు రాజీనామా సమర్పించారు. తన రాజీనామాలను ఆయన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు.

ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ.. కొత్తగూడెం జిల్లా తన సొంత ప్రాంతమనీ, అలాంటిది స్థానిక డీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని తనతో కనీసం చర్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు డీసీసీ పదవిని కోరితే ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనను నియమించడంపై కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.
Telangana
Congress
dcc
angry
pinapaka mla
rega kantarao

More Telugu News