Chandrababu: టీడీపీలో చేరిన నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు.. కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు

  • ఏపీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు మరో ఐదేళ్లు ఉండాలి
  • పట్టిసీమతో రాయలసీమ దశదిశ మారింది
  • ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు కలిసి టీడీపీని గెలిపించాలి
టాలీవుడ్ సీనియర్ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఆదిశేషగిరిరావు టీడీపీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీ వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భావించి, ఆయన పార్టీలో చేరినట్టు చెప్పారు. నటుడు మహేశ్‌బాబు కూడా టీడీపీకి మద్దతు ఇస్తారని శేషగిరిరావు చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు.

శేషగిరిరావు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమ దశదిశ మారిందని, ఏపీ ఇంకా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు కలిసి టీడీపీని గెలిపించాలని ఆదిశేషగిరిరావు కోరారు.
Chandrababu
Telugudesam
Actor krishna
Adiseshagiri Rao
Andhra Pradesh
Mahesh Babu

More Telugu News