Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • షూటింగుకి రెడీ అవుతున్న అనుష్క
  • 'సాహో' పాటల చిత్రీకరణకు ఏర్పాట్లు 
  •  మరో చిత్రానికి ఓకే చెప్పిన చైతూ

 *  'భాగమతి' చిత్రం తర్వాత కథానాయిక అనుష్క తన తదుపరి చిత్రాన్ని హేమంత్ మధుకర్ దర్శకత్వంలో చేస్తోంది. ఈ చిత్రంలోని గెటప్ కోసం అనుష్క ప్రస్తుతం ట్రయిల్స్ వేస్తోంది. మాధవన్ ప్రధాన పాత్ర పోషించే ఈ సినిమా షూటింగ్ త్వరలో అమెరికాలో మొదలవుతుంది.
*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. త్వరలో ఇక్కడే మూడు పాటలను చిత్రీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
* ప్రస్తుతం 'మజిలీ' చిత్రంలో నటిస్తున్న నాగ చైతన్య త్వరలో 'వెంకీమామ' చిత్రం షూటింగులో జాయిన్ అవుతాడు. అలాగే 'గరుడవేగ' చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి చైతూ ఓకే చెప్పాడట. 

More Telugu News