Agri Gold: అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. 3.5 లక్షల మందికి ఊరట

  • రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులకు చెల్లింపులు
  • రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణ
  • రూ.250 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు
అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్తను అందించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా 3.5 లక్షల మందికి ఊరట కల్పించనుంది. రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారు దాదాపు 3.5 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జిల్లా స్థాయి కమిటీల ద్వారా చెల్లింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.250 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
Agri Gold
Andhra Pradesh
Depositers
State Government

More Telugu News