Bosta Satyanarayana: ఈబీసీ రిజర్వేషన్లలో సగం కాపులకు ఇస్తానని చంద్రబాబు చెప్పటం పచ్చి మోసం: బొత్స

  • కాపులను మరోసారి మోసం చేసేందుకే తీర్మానం
  • మంజునాథ కమిషన్ నివేదిక మాటేంటి?
  • ఇప్పుడు 5 శాతమంటూ మరో తీర్మానమా?
10 శాతం ఈబీసీ రిజర్వేషన్లలో సగం కాపులకు ఇస్తానని సీఎం చంద్రబాబు చెప్పటం పచ్చి మోసమని వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నేడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపులను మరోసారి మోసం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తాజాగా తీర్మానం చేసిందని విమర్శించారు.

మంజునాథ కమిషన్ నివేదిక అమలు చేయాలని చేసిన తీర్మానం మాటేమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాపులను బీసీల్లో చేరుస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని పక్కకు పెట్టి ఇప్పుడు 5 శాతమంటూ మరో తీర్మానమా? అని బొత్స ప్రశ్నించారు.
Bosta Satyanarayana
Chandrababu
Assembly
EBC Reservations
Telugudesam
YSRCP

More Telugu News