cuddapah: ఈ గడ్డ నాకు, నా కుటుంబానికి చాలా ఇచ్చింది: కడపలో వైఎస్ జగన్

  • ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యత ఉంది
  • మేము అధికారంలోకొస్తే అందర్నీ ఆదుకుంటాం
  • చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు 
ఈ గడ్డ తనకు, తన కుటుంబానికి చాలా ఇచ్చిందని కడపలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో వైఎస్ జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యత తనపై ఉందని, తాము అధికారంలోకొస్తే అందర్నీ అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఈ నెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని, వైసీపీని గెలిపించే బాధ్యత తమ భుజాలపై వేసుకోవాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపు నిచ్చారు.

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, దొంగ సర్వేలు చేయిస్తూ, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని, ఎన్నికల సమయంలో డబ్బులు పంచాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని, వీటిని తొలగించే కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. మన యుద్ధం  కేవలం చంద్రబాబు ఒక్కరితోనే కాదని, ఎల్లో మీడియాతో కూడా అని అన్నారు.
cuddapah
YSRCP
ya jagan
samara sankaravam

More Telugu News