టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం వల్లే నేను గెలిచా!: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
- పవన్ కల్యాణ్, టీడీపీ, బీజేపీకి ధన్యవాదాలు
- నేను ఏ నేతనూ కించపరిచి మాట్లాడలేదు
- ఏపీ అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు వ్యాఖ్య
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విష్ణుకుమార్ రాజు ఈరోజు మాట్లాడారు. ఏ ఒక్క నేతనూ తాను కించపరిచి మాట్లాడలేదనీ, విధివిధానాల్లో లోపాలను మాత్రమే తప్పుపట్టానని వ్యాఖ్యానించారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో సంక్షేమ పథకాల అమలు ఏపీలో బాగానే జరిగిందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.