vande mataram: వందేమాతరం పాడేందుకు నిరాకరించిన ఉపాధ్యాయుడు.. దాడి చేసిన స్థానికులు!

  • గణతంత్ర దినోత్సవం నాడు బీహార్ లో చోటు చేసుకున్న ఘటన
  • వందేమాతరం పాడటానికి నిరాకరించిన అఫ్జల్ హుస్సేన్
  • వందేమాతరం పాడటం తమ మతానికి విరుద్ధమని వ్యాఖ్య

గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం వందేమాతరం పాటను పాడేందుకు నిరాకరించిన ఓ ముస్లిం ఉపాధ్యాయుడిపై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన బీహార్ లోని కతియార్ జిల్లాలో చోటుచేసుకోగా... దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు ఉపాధ్యాయుడిని అఫ్జల్ హుస్సేన్ గా గుర్తించారు. అబ్దుల్లాపూర్ ప్రైమరీ స్కూల్ లో ఈ ఘటన జరిగింది.

వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంతరం అఫ్జల్ హుస్సేన్ స్పందించాడు. వందేమాతరం పాడటం తన మతానికి విరుద్ధమని... అందుకే ఆ పాటను పాడేందుకు తాను నిరాకరించానని చెప్పాడు. వందేమాతరంలో 'వందన' అంటే భారతమాత అని... దాన్ని తాము విశ్వసించమని తెలిపాడు. మన రాజ్యాంగంలో వందేమాతరం తప్పనిసరిగా పాడాల్సిందేనని ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించాడు.

ఈ ఘటనపై డీఈవో దినేష్ చంద్ర దేవ్ మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఫిర్యాదు అందితే విచారణ జరుపుతామని తెలిపారు.

More Telugu News