Uttar Pradesh: కుంభమేళా స్పెషల్: చెత్త వేస్తే చాయ్ అందించే మెషీన్... వీడియో చూడండి!

  • అలహాబాద్ కుంభమేళాలో ఏర్పాటు
  • యాత్రికుల నుంచి మంచి స్పందన
  • వైరల్ అవుతున్న వీడియో

అది తాగేసిన మంచి నీళ్ల బాటిల్ అయినా, తినేసిన తరువాత ప్లేట్ అయినా... చెత్తను తీసుకువచ్చి వేస్తే, వేడివేడిగా చాయ్ ని ఇస్తుందీ మెషీన్. ఉత్తరప్రదేశ్, అలహాబాద్ లో జరుగుతున్న కుంభమేళాలో ఈ స్పెషల్‌  చాయ్ ఏటీఎం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. స్వచ్ఛ భారత్‌ లో  భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. కోట్లాది మంది భక్తులు కుంభమేళాకు వస్తున్న వేళ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న ఆలోచన చేసినట్టు తెలిపారు.

అలహాబాద్ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉన్నందున, తమ ప్రయోగానికి యాత్రికుల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రతి ఒక్కరూ తాము వాడేసిన చెత్తను తీసుకుని వచ్చి, ఇందులో పడేసి టీ తాగి వెళుతున్నారని చెప్పారు. ఇన్ ఫ్రారెడ్ సెన్సర్ ద్వారా ఈ మెషీన్ పని చేస్తుందని, చెత్తను పూర్తిగా వదిలిన తరువాత మాత్రమే టీని ఇస్తుందని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, మార్చి 4 వరకూ జరగనున్న కుంభమేళాకు 12 కోట్ల మంది వస్తారని అంచనా. ఈ చాయ్ ఏటీఎంకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని మీరు కూడా చూడవచ్చు.

  • Loading...

More Telugu News