భారత రాజకీయపార్టీలు మా సేవలను దుర్వినియోగం చేస్తున్నాయి.. బ్యాన్ చేస్తాం: వాట్సాప్ హెచ్చరిక
- ఎన్నికల నేపథ్యంలో, పూర్తి నిఘా ఉంచబోతున్నాం
- నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అకౌంట్లు బ్యాన్ చేస్తాం
- ఏడు నెలలుగా రాజకీయ పార్టీలకు అన్నీ వివరిస్తున్నాం
వాట్సాప్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ మాట్లాడుతూ, వాట్సాప్ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు తమ సేవలను వాడుకుంటున్నట్టు తాము గుర్తించామని... ఇకపై కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే వాటిపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. భారీ ఎత్తులో సందేశాలను పంపడం తమ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఆటోమేటెడ్ రోబోటిక్స్ ద్వారా పెద్ద ఎత్తున సందేశాలను పంపడం చేయవద్దని తెలిపారు. ఇదే విషయాన్ని గత ఏడు నెలలుగా రాజకీయ పార్టీలకు తాము వివరిస్తున్నామని చెప్పారు.