Andhra Pradesh: జనసేన తీర్థం పుచ్చుకున్న మాజీ డీఐజీ రవికుమార్ మూర్తి!

  • భార్యతో కలిసి జనసేన పార్టీలో చేరిక
  • కండువా కప్పి ఆహ్వానించిన పవన్
  • ప్రజా సేవకు పవన్ సరైన వ్యక్తి అన్న మూర్తి
జనసేన పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా రిటైర్డ్ డీఐజీ టి.రవికుమార్ మూర్తి, తన భార్యతో కలిసి జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ.. తాను పోలీస్ శాఖలో 29 ఏళ్లు పనిచేశానని తెలిపారు. సమాజ సేవ చేయాలన్న లక్ష్యంతోనే తాము జనసేనలో చేరినట్లు స్పష్టం చేశారు. ప్రజలకు చేరువై వారి సమస్యలు పరిష్కరించడానికి పవన్ కల్యాణే సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
join
ex dig
ravi kumar murthy

More Telugu News