shatrughan sinha: 'మీటూ'లో నా పేరు రాకపోవడం అదృష్టకరం: శత్రుఘన్ సిన్హా

  • విజయవంతమైన వ్యక్తి పతనం వెనుక కూడా ఓ మహిళ ఉంటుంది
  • మీటూ ఉద్యమం ద్వారా నాకు ఈ విషయం అర్థమైంది
  • నాకు నా భార్యే దేవత, నా ప్రపంచం
మీటూ ఉద్యమం సినీ సెలబ్రిటీలు, రాజకీయవేత్తలతో పాటు పలువురు ప్రముఖుల వెన్నులో చలి పుట్టించిన సంగతి తెలిసిందే. దీని దెబ్బకు ఎంతో మంది పరువు బజారున పడింది. దీనిపై బీజేపీ నేత, సినీ నటుడు శత్రుఘన్ సిన్హా తనదైన శైలిలో చమత్కరించారు. విజయవంతమైన వ్యక్తి పతనం కావడం వెనుక కూడా ఓ మహిళ ఉంటుందని చెప్పారు. తాను మీటూ ఉద్యమాన్ని కించపరచడం లేదని... తన వ్యాఖ్యల్లో ఉన్న చమత్కారాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం మీటూ కాలం నడుస్తోందని... విజయవంతమైన వ్యక్తి పతనం వెనుక కూడా ఓ మహిళ ఉంటుందనే నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడకూడదని సిన్హా తెలిపారు. పురుషుడి పతనం వెనుక మహిళ ఉంటుందనే విషయం మీటూ ఉద్యమం ద్వారా తనకు అర్థమయిందని చెప్పారు. మీటూలో తన పేరు రాకపోవడం తన అదృష్టమని అన్నారు. తన భార్య మాటను తాను వింటానని, ఆమెను రక్షణ కవచంగా వాడుకుంటానని చెప్పారు. తన జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సాగిపోతోందని దీని ద్వారా బయటి ప్రపంచానికి చూపించగలనని అన్నారు. తన భార్య పూనమ్ తన ప్రపంచమని, తన దేవత అని కొనియాడారు. తన గురించి ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నా... ఏదీ చెప్పవద్దని కోరారు.

మహిళల ధైర్యానికి తాను శాల్యూట్ చేస్తున్నానని సిన్హా చెప్పారు. తమకు జరిగిన అన్యాయం గురించి మహిళలు ధైర్యంగా చెబుతుండటం హర్షించదగ్గ విషయమని అన్నారు.
shatrughan sinha
meetoo
bollywood
bjp

More Telugu News