Chandrababu: నేను కులమతాలకు అతీతం.. నా కులం పేదరికం: వైసీపీ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్

  • నాకు కులాన్ని ఆపాదిస్తారా?
  • మీ పక్కనే కొన్ని కులాల వారు ఉంటారు
  • వైసీపీ నేతలపై సీఎం మండిపాటు
కులం పేరుతో తనపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం దారుణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తనకు ప్రత్యేకంగా కులమంటూ లేదని, పేదరికమే తన కులమని అన్నారు. తన పక్కన అన్ని కులాల వారూ ఉంటారని, కానీ వారి (వైసీపీ నేతలు) పక్కన మాత్రం కొన్ని కులాల వారే ఉంటారని అన్నారు.

కొన్ని కులాల వారిని తన పక్కన పెట్టుకునే వారు తనపై విమర్శలు చేయడం అర్థ రహితమని చంద్రబాబు మండిపడ్డారు. వారి తప్పుడు విధానాలను తనకు అంటగట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అందరికీ తాము ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతిని రెండువేల రూపాయలకు పెంచి ఇస్తామన్న సీఎం.. క్షత్రియుల్లోని పేదల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేశామని, అలాగే, రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల్లోని పేదలను ఆదుకునేందుకు కూడా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
Chandrababu
YSRCP
Andhra Pradesh
poverty
Jagan

More Telugu News