Karnataka: ఆవు పేడను చోరీ చేసిన ప్రభుత్వ ఉద్యోగి.. అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు

  • రూ. 1.25 లక్షల విలువైన పేడ దొంగతనం
  • రాత్రికి రాత్రే మాయం చేసిన సూపర్ వైజర్
  • పోలీసులకు ఫిర్యాదు.. నిందితుడి అరెస్ట్

ఆవు పేడను దొంగిలించిన ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని జైలుకు పంపించారు. కర్ణాటకలోని చిక్కమగలూరు జిల్లా బీరూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక పశుసంవర్థక శాఖ రూ.1.25 లక్షల విలువైన 40 ట్రాక్టర్ల పేడను సేకరించింది. ఎరువు కోసం దీనిని బాసూర్‌లోని అమృత్ మహల్‌లో భద్రపరిచారు. ఈ పేడపై కన్నేసిన సూపర్ వైజర్ రాత్రికిరాత్రే పేడను మాయం చేశాడు.  

భద్రపరిచిన పేడ అదృశ్యం కావడంతో అవాక్కయిన అధికారులు విచారణ ప్రారంభిస్తే సూపర్ వైజరే దానిని మాయం చేశాడని తేలింది. దీంతో సూపర్ వైజర్‌పై అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దొంగిలించిన పేడలో కొంత భాగాన్ని అమ్మేసి, మిగతా దానిని పిడకలు చేసి అమ్మాలని సూపర్ వైజర్ భావించినట్టు పోలీసుల విచారణలో తేలింది.

More Telugu News