Chandrababu: అది అద్భుతమైన ఆలోచన: ల్యాండ్ పూలింగ్‌పై చంద్రబాబు

  • ఏపీ విభజన తర్వాత చేతిలో చిల్లిగవ్వ లేదు
  • ల్యాండ్ పూలింగ్‌తో ముందుకెళ్లాం
  • ఎనర్జీ ఇన్నోవేషన్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో సీఎం
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ల్యాండ్ పూలింగ్ వంటి అద్భుతమైన ఆలోచనతో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఎనర్జీ ఇన్నోవేషన్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి 20 దేశాల నుంచి ప్రతినిధులు రావడం సంతోషకరమన్నారు. ల్యాండ్ పూలింగ్ అన్న ఒకే ఒక్క ఆలోచనతో అమరావతి నిర్మాణానికి అడుగులు వేసినట్టు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు  10.52 శాతానికి చేరుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం, విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న చంద్రబాబు 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఎకరాన్ని ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తామని పేర్కొన్నారు.
Chandrababu
Andhra Pradesh
Vijayawada
land pooling
Amaravathi

More Telugu News