Amit Shah: ఎన్డీయే నుంచి చంద్రబాబు తప్పుకున్నది అందుకే!: అమిత్ షాకు విజయశాంతి కౌంటర్

  • అమిత్ షా వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్
  • బీజేపీలో మోదీ భజన ఎక్కువైంది
  • మోదీ ఆధిపత్య ధోరణి వల్లే సీనియర్ నేతలు దూరమవుతున్నారు

బీజేపీలో ప్రధాని మోదీ ఆధిపత్య ధోరణి ఎక్కువైందని, ఓ వ్యక్తి చుట్టూ ఆ పార్టీ తిరుగుతుండడం వల్లే పార్టీకి సీనియర్లు దూరమవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. కూటమిలోని మిత్ర పక్షాలను బీజేపీ లెక్కచేయడం లేదని, వాటి అవసరం లేకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కలలు కంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికలు మోదీకి, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతాయని ఆయన చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. ఇలా ఓ వ్యక్తి చుట్టూ బీజేపీ తిరగడం వల్ల, మోదీ ఆధిపత్య ధోరణి వల్లే సీనియర్ నేతలు ఆ పార్టీకి రాం రాం చెబుతున్నారని విమర్శించారు. ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు తప్పుకోవడానికి కూడా కారణం అదేనని ట్విట్టర్ ద్వారా విజయశాంతి పేర్కొన్నారు.  ఇంత జరుగుతున్నా పార్టీలో ఇంకా మోదీ భజనే జరుగుతుండడం ఆయన నిరంకుశత్వానికి అద్దం పడుతోందని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ప్రకటనపై శివసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందేనని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.  

More Telugu News