Congress: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ

  • ప్రియాంకను అభినందించిన పలువురు నేతలు
  • రాహుల్ చాంబర్ పక్కనే ప్రియాంక కార్యాలయం 
  • రేపు తొలి అధికారిక సమావేశంలో పాల్గొననున్న ప్రియాంక  
  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రియాంకను పార్టీ నేతలు పలువురు అభినందించారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్ లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్ చాంబర్ పక్కనే ప్రియాంక కార్యాలయం ఏర్పాటు చేశారు. కాగా, తొలి అధికారిక సమావేశంలో ప్రియాంక రేపు పాల్గొననున్నారు. సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్ ఛార్జిలతో ఆమె సమావేశం కానున్నారు.
 
ఇదిలా ఉండగా, మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియంక భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ అధికారులు నేడు విచారించారు. తన భర్తను ఈడీ కార్యాలయం ఎదుట కారులో దింపిన ప్రియాంక, అక్కడి నుంచి నేరుగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లి  ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
Congress
Priyanka gandhi
dehli
akbar road

More Telugu News