Uttar Pradesh: యూపీలో 40 లక్షల మంది ఉద్యోగుల సమ్మె.. ఎస్మాను ప్రయోగించిన యోగి ప్రభుత్వం

  • సమ్మెలో పాల్గొంటున్న టీచర్లు, ఇంజినీర్లు, తహసీల్దార్లు, ట్రాన్స్ పోర్ట్ సిబ్బంది
  • పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్
  • ఆరు నెలల పాటు ఎలాంటి సమ్మె చేపట్టరాదంటూ ఎస్మా ప్రయోగం
ఏకంగా 40 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు సమ్మె బాట పట్టడంతో ఉత్తరప్రదేశ్ లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. టీచర్లు, ఇంజినీర్లు, తహసీల్దార్లు, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెట్ సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రస్తుత పెన్షన్ స్కీమ్ ను ఎత్తివేసి... పాత స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీరంతా ఏడు రోజుల సమ్మెకు దిగారు.

మరోవైపు, సమ్మెకు దిగిన ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర జేసింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆరు నెలల పాటు అన్ని విభాగాలు, కార్పొరేషన్లలోని ఉద్యోగులు ఎలాంటి సమ్మెలు చేపట్టరాదంటూ ఎస్మా నోటిఫికేషన్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూప్ చంద్ర పాండే జారీ చేశారు. ఎస్మా అమల్లో ఉంటే ఎలాంటి వారెంటు లేకుండా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఏడాది జైలు శిక్ష, రూ. 1000 జరిమానా, లేదా రెండు కలపి విధించే అవకాశం ఉంటుంది.
Uttar Pradesh
employees
strike
esma

More Telugu News