srivishnu: 'తిప్పరా మీసం' నుంచి ఫస్టులుక్ వచ్చేసింది

  • శ్రీవిష్ణు నుంచి 'తిప్పరా మీసం'
  • విభిన్నమైన కథాకథనాలు
  •  మార్చి 15వ తేదీన విడుదల  

శ్రీవిష్ణు మొదటి నుంచి కూడా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఆరంభంలో పలకరించిన విజయాలు ఆ తరువాత ముఖం చాటేశాయి. 'మెంటల్ మదిలో' .. 'నీదీ నాదీ ఒకే కథ' చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో ఆయన కృష్ణ విజయ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు .. ఆ సినిమా పేరే 'తిప్పరా మీసం'.

తాజాగా ఈ సినిమా నుంచి శ్రీవిష్ణు ఫస్టులుక్ ను వదిలారు. ఫస్టులుక్ ను బట్టి .. ఈ సినిమాలో శ్రీవిష్ణు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే విషయం అర్థమవుతోంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మార్చి 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో శ్రీవిష్ణు వున్నాడు. ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి. 

  • Loading...

More Telugu News