Andhra Pradesh: చంద్రబాబు గారూ.. ఇక మీరు చేయనిది ‘బంగీ జంప్’ ఒక్కటే.. దాన్ని కూడా చేసేయండి!: వైసీపీ నేత లక్ష్మి గజ్జెల సెటైర్

  • జగన్ నవరత్నాలను కాపీ కొట్టారు
  • ఆటో డ్రైవర్, నలుపు చొక్కాలను వేసుకున్నారు
  • బంగీజంప్ చేస్తే మేమంతా సంతోషిస్తాం
వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన అన్ని పథకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆ పార్టీ నేత గజ్జెల లక్ష్మి విమర్శించారు. జగన్ ఆటో డ్రైవర్ డ్రెస్, నల్ల చొక్కా వేస్తే చంద్రబాబు కూడా వేశారని దుయ్యబట్టారు. చివరికి నవరత్నాలను సైతం చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక జగన్ చేసింది.. చంద్రబాబు చేయకుండా మిగిలిపోయింది ‘బంగీ జంప్’ ఒక్కటేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మరోసారి ఏపీ ముఖ్యమంత్రి కావాలంటే, ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే, ఇంకా క్రేజ్ రావాలంటే బంగీజంప్ చేయాలని చంద్రబాబుకు ఆమె సూచించారు. చంద్రబాబు బంగీజంప్ చేస్తే తప్పకుండా మరోసారి ముఖ్యమంత్రి అవుతారని సెటైర్ వేశారు. చిత్తూరు జిల్లా వాసులుగా తామంతా చంద్రబాబు బంగీ జంప్ చేస్తే చూసి సంతోషిస్తామన్నారు.

చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులు బంగీజంప్ చేస్తే యువత ఆయన నుంచి చాలా మెలకువలు నేర్చుకోవచ్చని వ్యాఖ్యానించారు. జగన్ హామీల్లో చంద్రబాబు కాపీ కొట్టకుండా మిగిలిపోయింది ఇక బంగీజంప్ మాత్రమేననీ, దయచేసి దాన్ని కూడా చేయాలని వ్యంగ్యంగా కోరారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
bangi jump
YSRCP
lakshmi gajjala

More Telugu News