India: నేను ఇంగ్లండ్ రాణిని అన్నది నిజమైతే.. ఆరెస్సెస్ నిజంగా లౌకికవాద సంస్థే!: మెహబూబా ముఫ్తీ సెటైర్

  • మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు కౌంటర్
  • ఆరెస్సెస్ లౌకికవాద సంస్థ అన్న విద్యాసాగర్ రావు
  • మిశ్రమంగా స్పందించిన నెటిజన్లు

మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ విరుచుకుపడ్డారు. హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అత్యంత లౌకికవాద సంస్థ అని విద్యాసాగర్ రావు చెప్పడాన్ని తప్పుబట్టారు.

ఆరెస్సెస్ అన్ని మతాలను గౌరవిస్తుందని ఆయన చెప్పడంపై ముఫ్తీ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘నేను ఇంగ్లండ్ రాణిని, ఇప్పుడు చంద్రమండలం పైనుంచి ఈ ట్వీట్ చేస్తున్నా.. ఇదంతా నిజమైతే ఆరెస్సెస్ కూడా నిజంగా గొప్ప లౌకికవాద సంస్థే’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

కాగా, ముఫ్తీ చేసిన సెటైరికల్ ట్వీట్ పై మిశ్రమ స్పందన వస్తోంది. చాలా బాగా చెప్పారంటూ కొందరు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ ఉంటే, ఇన్నాళ్లూ ఆరెస్సెస్ కు అనుబంధంగా ఉన్న బీజేపీతో కశ్మీర్ లో ముఫ్తీ అధికారాన్ని పంచుకున్న విషయాన్ని మరికొందరు గుర్తుచేస్తూ దెప్పిపొడుస్తున్నారు.

More Telugu News