Ghattamaneni: రేపు తెలుగుదేశంలోకి మహేశ్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు!

  • విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ
  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి
  • నగరవ్యాప్తంగా వెలిసిన ప్లెక్సీలు
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు బాబాయ్, హీరో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఆదిశేషగిరిరావు చేరికను ఘనంగా జరిపించేందుకు టీడీపీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే నగర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అనేక ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

కాగా, ఒకే సామాజిక వర్గమైనా, దాదాపు నాలుగు దశాబ్దాలుగా వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్న నందమూరి, ఘట్టమనేని కుటుంబాలు ఇప్పుడు ఒకే రాజకీయ వేదికపైకి వస్తుండటంతో ఇరు కుటుంబాల అభిమానుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తరువాత, కాంగ్రెస్ లో చేరిన కృష్ణ, ఎంపీగా పోటీచేసి గెలిచి, కొంతకాలం రాజకీయాల్లో రాణించిన సంగతి తెలిసిందే. కృష్ణ, ఎన్టీఆర్ లు ఇలా వేర్వేరు పార్టీల్లో కొనసాగుతూ రాగా, వారి అభిమానుల మధ్య పెరిగిన దూరాన్ని ఇప్పుడు ఆదిశేషగిరిరావు చెరిపేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Ghattamaneni
Krishna
Telugudesam
Adiseshagirirao
Vijayawada

More Telugu News