gandhi: గాంధీ బొమ్మను తుపాకీతో కాల్చి సంబరాలు.. హిందూ మహాసభ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఘటన
  • గాంధీ వర్ధంతి సందర్భంగా నేతల నిర్వాకం
  • భార్యభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
భారత జాతి పిత మహాత్మా గాంధీని 1948, జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్చిచంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని హిందూ మహాసభకు చెందిన పూజా పాండే.. మహాత్మాగాంధీ బొమ్మను తుపాకీతో కాల్చి కలకలం రేపారు. గాంధీ బొమ్మను కాల్చగానే, రక్తం కారుతున్నట్లు సీన్ కూడా సృష్టించారు. అనంతరం వీరంతా కలిసి సంబరాలు చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ పోలీసులు పూజా పాండే, ఆమె భర్త అశోక్ పాండేను ఈరోజు అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 
gandhi
death anniversary
Uttar Pradesh
hindu mahasabha
Police
arrest

More Telugu News