Rakesh: ఎలాగైనా జయరామ్ నుంచి బాకీ వసూలు చేయాలి, శిఖాపై పగ తీర్చుకోవాలి: డైరీలో రాసుకున్న రాకేశ్ రెడ్డి!

  • పోలీసుల స్వాధీనంలో రాకేశ్ డైరీ
  • రాతను సరిపోల్చుకున్న పోలీసులు
  • కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తామంటున్న అధికారులు
చిగురుపాటి జయరాం హత్య కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా భావిస్తున్న రాకేశ్ రెడ్డి డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని రాతలను సరిపోల్చుకున్న పోలీసులు, అది రాకేశ్ రాసినదేనని గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక ఈ డైరీలో రాకేశ్ పలు కీలక విషయాలు రాసుకున్నాడు. జయరామ్ కు తాను అప్పుగా ఇచ్చిన మొత్తం డబ్బునూ ఎలాగైనా వసూలు చేయాలని, తనను మోసం చేస్తున్న శిఖా చౌదరిపై పగ తీర్చుకుని తీరుతానని కూడా రాకేశ్ రాసుకున్నాడు. ఇప్పుడీ డైరీని విశ్లేషిస్తున్న పోలీసులు, కేసును ఇంకా విచారించాల్సి వుందని, కోర్టు అనుమతితో అతన్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామని అంటున్నారు.
Rakesh
Jayaram
Rakesh Reddy
Police
Dairy

More Telugu News