Maharashtra: సీఎం ఫడ్నవీస్ హామీతో నిరాహార దీక్ష విరమించిన అన్నాహజారే

  • లోక్ పాల్, లోకాయుక్త ఏర్పాటుకు డిమాండ్
  • 13న లోక్ పాల్ కమిటీ సమావేశం 
  • సంయుక్త ముసాయిదా కమిటీ ఏర్పాటు  

కేంద్రంలో లోక్ పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే ఏడు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హామీ మేరకు తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో చేస్తున్న దీక్షను అన్నా హజారే విరమించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ, ఈ నెల 13న లోక్ పాల్ కమిటీని సమావేశ పర్చాలని నిర్ణయించామని, అలాగే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అసుసరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ విషయమై సంయుక్త ముసాయిదా కమిటీ ఏర్పాటు చేస్తామని, కొత్త బిల్లును రూపొందించి, దానిని అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News