kolkata: మోదీని గద్దె దింపి గుజరాత్ కు పంపించడం ఖాయం: ధర్నా విరమించిన మమతా బెనర్జీ

  • మమతతో ధర్నా విరమింపజేసిన చంద్రబాబు
  • ధర్నా స్థలానికి రాజీవ్ కుమార్ రాలేదు
  • రాజీవ్ కుమార్ పై కేంద్రానివి తప్పుడు ఆరోపణలు: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ‘సేవ్ ఇండియా’ నినాదంతో చేపట్టిన ధర్నాను విరమించారు. కోల్ కతా వేదికగా మమత చేసిన దీక్షను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ధర్నా రాజ్యాంగ, ప్రజాస్వామ్య, ప్రజల విజయమని అన్నారు.

ఒక పోలీసు అధికారి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతోందని ప్రశ్నించారు. కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ ధర్నా స్థలానికే రాలేదని, ఈ ధర్నాలో ఆయన పాల్గొన్నట్టు కేంద్రం తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె విమర్శలు చేశారు. మోదీని గద్దె దింపి గుజరాత్ కు పంపించడం ఖాయమని జోస్యం చెప్పారు.

More Telugu News