Chandrababu: ఈ ముగ్గురు వ్యక్తులపైనే ఏపీ రాజకీయాలు, ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి: తమ్మారెడ్డి భరద్వాజ

  • ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు రాష్ట్రాన్ని ఏలబోతున్నారు
  • ఏపీకి జరిగిన అన్యాయంపై వీళ్లు కలిసి మాట్లాడాలి
  • అంతేతప్ప, అంటీముట్టనట్టు కూర్చోవడం కరెక్టు కాదు
ఏపీ రాష్ట్రం చంద్రబాబునాయుడు, జగన్, పవన్ కల్యాణ్ ఈ ముగ్గురు వ్యక్తుల మీద ఈరోజున ఆధారపడి ఉందని ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. ‘నా ఆలోచన’లో ఆయన మాట్లాడుతూ, ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు రాష్ట్రాన్ని ఏలబోతున్నారని, ఈ ముగ్గురు వ్యక్తుల మీద రాష్ట్ర రాజకీయాలు, ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని అన్నారు.

ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే జనసేన, వైసీపీలు హాజరుకాని విషయాన్ని గుర్తుచేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకపోయినా, కనీసం చిన్నాచితకపార్టీలను కూర్చోబెట్టి ఈ ముగ్గురూ కలిసి మాట్లాడితే వీరి అభిప్రాయం తెలుస్తుందని అన్నారు. అంతేతప్ప, ఎవరు పిలిచినా అంటీముట్టనట్టు కూర్చోవడం సరైన ఆలోచన కాదని, అందరూ, ఒకే వేదికపైకి వచ్చి వారి వారి అభిప్రాయాలు చెప్పాలని కోరారు. వెలివేయాల్సిన బీజేపీ వాళ్లను కూడా ఉండవల్లి తన కార్యక్రమానికి పిలిచారని, అది ఆయన సంస్కారమని ప్రశంసించారు. 
Chandrababu
Jagan
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News