vishal: తమిళ 'టెంపర్' రీమేక్ నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • ఎన్టీఆర్ హీరోగా పూరి తెరకెక్కించిన 'టెంపర్'
  • హిందీలో 'సింబా' పేరుతో రీమేక్
  •  తమిళంలో 'అయోగ్య'గా విశాల్    

తమిళంలో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. ఈ మధ్యకాలంలో విశాల్ చేసిన సినిమాలన్నీ కూడా ఆయనకి విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా 'అయోగ్య' రూపొందుతోంది. పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో విశాల్ కనిపించనున్నాడు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా నటిస్తోంది.

'ఠాగూర్' మధు నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి రేపు తమిళ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్' సినిమాకి ఇది రీమేక్. హిందీలో 'టెంపర్' సినిమాకి రీమేక్ గా వచ్చిన 'సింబా' అక్కడ భారీ వసూళ్లను సాధించింది. అలాగే తమిళంలోను ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి. 

More Telugu News