మాది మోదీలా ప్రజలను ప్రలోభ పెట్టే బడ్జెట్ కాదు: కర్ణాటక సీఎం
- నా బడ్జెట్‌లో ప్రలోభాలు ఉండవు
- ఆపరేషన్ లోటస్‌కు నేను అడ్డుపడను
- మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి దేశ ప్రజలు ఎంతో నిరాశకు గురయ్యారన్న కుమారస్వామి ఆ పరిస్థితి రాష్ట్ర ప్రజలకు రానివ్వబోనన్నారు. విదేశాల్లోని నల్లధనాన్ని దేశానికి తీసుకొస్తానన్న మోదీ సాధించింది శూన్యమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయల ఆశ చూపి కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వస్తోందని కుమారస్వామి ప్రశ్నించారు.