Andhra Pradesh: మా పాలనలో ప్రజలు సుఖంగా ఉంటే ఇంకా ‘నవరత్నాలు’ ఎందుకు?: యనమల రామకృష్ణుడు

  • పేదలు బాగుపడితే చూడలేని మనస్తత్వం జగన్ ది
  • జగన్ అధికారంలో కొస్తే ఇంకా దోచుకుంటారు
  • జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారు
వైసీపీ అధికారంలోకొస్తే ‘నవరత్నాలు’ అందిస్తామని చెబుతోందని, టీడీపీ పాలనలో ప్రజలు ఇంత సుఖంగా ఉంటే ఇంకా ఆ ‘నవరత్నాలు’ ఎందుకు? అని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు అందజేసిన చెక్కులపైనా జగన్ విమర్శలు చేయడం తగదని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. పేద ప్రజలు బాగుపడితే చూడలేనటువంటి మనస్తత్వం జగన్ ది అని దుమ్మెత్తి పోశారు.

 మోదీని జగన్ ఎన్నోసార్లు కలిశాడని, అయినప్పటికీ ఏపీ సంక్షేమం గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. జగన్ కు కుర్చీ వస్తే దోచుకున్న లక్ష కోట్లు దాచుకోవచ్చు, అదే విధంగా మరో లక్ష కోట్లు దోచుకోవచ్చని చూస్తున్నాడని, ఇలాంటి ఆలోచనలో ఉన్న తనకు ప్రజలు బుద్ధి చెబుతారన్న భయం జగన్ కు కలిగిందని వ్యాఖ్యానించారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే మోదీతో జగన్ జతకలిశాడు తప్ప, ఏపీ ప్రజల సంక్షేమాన్ని ఆశించి కాదని విమర్శించారు.  
Andhra Pradesh
Telugudesam
Yanamala
YSRCP
Jagan

More Telugu News