nandamuri: నందమూరి తారకరత్న రెస్టారెంట్ ను కూల్చివేసిన జీహెచ్ఎంసీ.. అధికారులతో వాగ్వాదం!

  • బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో తారకరత్న రెస్టారెంట్
  • అధికారులతో వాగ్వాదానికి దిగిన రెస్టారెంట్ సిబ్బంది
  • హుటాహుటిన అక్కడకు చేరుకున్న తారకరత్న
సినీ నటుడు నందమూరి తారకరత్నకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో తారకరత్న నిర్వహిస్తున్న కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంటును అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా అధికారులతో రెస్టారెంట్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అధికారులతో ఆయన కూడా వాదనకు దిగారు. రాత్రి వేళల్లో మద్యం అమ్మకాలతో పాటు పెద్ద శబ్దాలతో న్యూసెన్స్ చేస్తున్నారంటూ అక్కడి సొసైటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
nandamuri
tarakaratna
ghmc
restaurant

More Telugu News