rajasekhar: ఆసక్తిని రేకెత్తిస్తోన్న రాజశేఖర్ 'కల్కి' టీజర్

  • ప్రశాంత్ వర్మ నుంచి 'కల్కి'
  • 'యాంగ్రీ స్టార్' గా రాజశేఖర్
  •  హీరోయిన్స్ గా ఆదా శర్మ .. నందిత శ్వేత

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' సినిమా రూపొందుతోంది. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ నిర్మాత సి.కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజున రాజశేఖర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు.

యాక్షన్ సీన్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. వర్షంలో రాజశేఖర్ పై ఒక గ్యాంగ్ చేసే దాడిని ఈ టీజర్లో చూపించారు. రాజశేఖర్ సినిమా నుంచి ఆడియన్స్ ఆశించే యాక్షన్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజశేఖర్ సరసన కథానాయికలుగా ఆదా శర్మ .. నందిత శ్వేత కనిపించనున్నారు. నిన్నమొన్నటి వరకూ అభిమానులతో 'యాంగ్రీ యంగ్ మేన్' అంటూ పిలిపించుకున్న రాజశేఖర్, ఈ సినిమాతో 'యాంగ్రీ స్టార్' గా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.                                       

More Telugu News