anushka: 'సైరా'లో ప్రత్యేక పాత్రలో అనుష్క?

  • షూటింగు దశలో 'సైరా'
  • నాయికగా నయనతార 
  • ముఖ్యమైన పాత్రలో తమన్నా  

చిరంజీవి కథానాయకుడిగా అత్యంత భారీ బడ్జెట్ తో 'సైరా' సినిమా నిర్మితమవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఇక ఒక ముఖ్యమైన పాత్రలో తమన్నాను తీసుకున్నారు. మరో ప్రత్యేకమైన పాత్ర కోసం అనుష్కను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం.

'సైరా'లో ఒక బరువైన ప్రత్యేక పాత్ర ఉందట. ఈ పాత్రను అనుష్క చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సురేందర్ రెడ్డి వ్యక్తం చేయడంతో, చరణ్ స్వయంగా అనుష్కతో మాట్లాడి ఆమెను ఒప్పించినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. గతంలో అనుష్క ప్రత్యేకమైన పాత్రలను చేసింది. అయితే తనకి తొలి ఛాన్స్ ఇచ్చిన నాగార్జున మాట కాదనలేక మాత్రమే ఆమె ఆయన సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించింది. అలాంటిది 'సైరా' సినిమాలో ప్రత్యేక పాత్రను చేయడానికి అనుష్క ఒప్పుకుందనే వార్తలో వాస్తవమెంతన్నది చూడాలి. 

More Telugu News