Jayaram: ఓ యాంకర్ ద్వారా జయరామ్‌ను ఇంటికి పిలిపించా.. అక్కడే చంపేశా: విచారణలో రాకేష్ రెడ్డి

  • శిఖా చౌదరితో డేటింగ్ చేశా
  • శిఖాకు చాలామందితో సంబంధాలున్నాయి
  • డబ్బు విషయమై జరిగిన గొడవలో హత్య చేశా
పారిశ్రామికవేత్త జయరామ్ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాకేష్ రెడ్డిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. గతంలో శిఖా చౌదరితో డేటింగ్ చేశానని.. పెళ్లి వరకూ సంబంధం వెళ్లిందని కానీ ఆమెకు చాలామందితో సంబంధాలున్నాయని తెలియడంతో పెళ్లికి నిరాకరించానని రాకేష్ రెడ్డి తెలిపాడు.

ఓ యాంకర్ ద్వారా జయరామ్‌ను తన ఇంటికే పిలిపించానని.. డబ్బు విషయమై జరిగిన గొడవలో జయరామ్‌ను చంపేసినట్టు రాకేష్ రెడ్డి.. పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ హత్యోదంతంలో తనతో పాటు సహాయకుల హస్తం కూడా ఉన్నట్టు రాకేష్‌రెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది.
Jayaram
Sikha Chowdary
Rakesh reddy
Police
Anchor

More Telugu News