Tycoon: జయరాంను హత్య చేయాల్సిన అవసరం శిఖా చౌదరికి లేదు: తెలుగు ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి

  • ఈ హత్య కేసులో శిఖాకి ఎలాంటి సంబంధం లేదు
  • జయరాం అంటే శిఖాకు ఎంతో అభిమానం
  • శిఖా చౌదరి నన్ను ‘అన్నయ్య’ అని పిలుస్తుంది
ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి ఎలాంటి సంబంధం లేదని తెలుగు ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా నందిగామలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జయరాంను హత్య చేయాల్సిన అవసరం శిఖా చౌదరికి లేదని, వారి మధ్య ఎంతో ప్రేమానుబంధం ఉందని అన్నారు. శిఖా చౌదరి తనను ‘అన్నయ్య’ అని పిలుస్తుందని, తమది అన్నాచెల్లెలి సంబంధమని చెప్పారు. తన బీఎండబ్ల్యూ కారులో శిఖా చౌదరిని నిన్న పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చానని, అందుకే, ఆ కారును నిన్న సాయంత్రం తానే వచ్చి తీసుకెళ్లినట్టు చెప్పారు. శిఖా చౌదరి ప్రియుడు రాకేశ్ రెడ్డి గురించి మీడియా ప్రశ్నించగా, అతనెవరో తనకు తెలియదని సమాధానమిచ్చారు.
Tycoon
coastal bank director
chigurupati
jayaram

More Telugu News