Team India: మళ్లీ అదే వరుస.. పెవిలియన్‌కు భారత బ్యాట్స్‌మెన్ క్యూ.. 17 పరుగులకే మూడు వికెట్లు డౌన్

  • కివీస్ బౌలింగ్‌కు తలవంచుతున్న భారత బ్యాట్స్‌మెన్
  • మ్యాట్ హెన్రీ విజృంభణ
  • రెండు పరుగులకే అవుటైన కెప్టెన్ రోహిత్
నాలుగో వన్డే ఆటతీరును టీమిండియా ఆటగాళ్లు మరిచిపోయినట్టు లేదు. కివీస్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలోనూ భారత ఆటగాళ్లు అచ్చం అలాగే ఆడుతున్నారు. 17 పరుగులకే మూడు వికెట్లు సమర్పించుకుని పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌‌ను కివీస్ బౌలర్ మాట్ హెన్రీ దారుణంగా దెబ్బ కొట్టాడు. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ(2)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (6)ను బౌల్ట్ పెవిలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శుభమన్ గిల్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 7 పరుగులు మాత్రమే చేసి మాట్ హెన్రీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ క్రీజులో ఉన్నారు.
Team India
Kiwis
Newzealand
Rohit Sharma
MS Dhoni

More Telugu News