Kruti Sanan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఐటెం సాంగ్ చేస్తున్న కృతి సనాన్ 
  • తదుపరి చిత్రం కోసం మహేశ్ జాగ్రత్తలు 
  • ట్రెండీ యోగా ప్రాక్టీస్ చేస్తున్న రకుల్

*  ఆమధ్య 'దోచేయ్' సినిమాలో నటించిన కథానాయిక కృతి సనాన్ ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా వుంది. ఈ క్రమంలో ఈ చిన్నది తాజాగా ఓ చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది. కరణ్ జొహార్ నిర్మిస్తున్న 'కళంక్ 'చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ప్రత్యేక పాటలో నటిస్తోందట.  
*  మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మహేశ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇప్పటికే ఈ విషయంలో దర్శకుడితో కలసి పలు సిటింగ్స్ వేసిన మహేశ్ పలు సలహాలు, సూచనలు ఇస్తున్నాడని తెలుస్తోంది. స్క్రిప్ట్ తనకి సంతృప్తికరంగా వస్తేనే కానీ సెట్స్ కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడట.
*  అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఏరియల్ యోగా చేస్తూ జిమ్ లో ఎక్కువసేపు గడుపుతోంది. తను త్వరలో నటించనున్న హిందీ చిత్రం 'మార్జావాన్'లోని పాత్ర కోసం ఈ ట్రెండీ ఏరియల్ యోగాను ప్రాక్టీస్ చేస్తోందట. ఈ యోగాను తాను బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది.

  • Loading...

More Telugu News