professor anand teltumbde: కోరేగావ్ భీమా కేసులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడి అరెస్ట్

  • మావోయిస్టుల మద్దతు ఉన్న సమావేశానికి ప్రొఫెసర్ ఆనంద్
  • ఉద్రేకపూరిత ఉపన్యాసంతో ప్రజలను రెచ్చగొట్టారని అభియోగాలు
  • ఆయన అరెస్ట్ చట్ట విరుద్ధమన్న న్యాయస్థానం
కోరేగావ్ భీమా యుద్ధ స్మారకం వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేలా ఉపన్యసించి ప్రజలను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వరుసకు మనవడయ్యే ప్రొఫెసర్ ఆనంద్‌ తెల్‌తుంబ్డేను శనివారం పుణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

31 డిసెంబరు 2017న ఎల్గార్ పరిషత్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి మావోయిస్టుల మద్దతు ఉందని, ఉద్రేకపూరితంగా ప్రసంగించి ప్రజలను రెచ్చగొట్టారంటూ ఆనంద్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ప్రొఫెసర్ ఆనంద్ ప్రసంగించిన మరునాడే కోరేగావ్ భీమా యుద్ధ స్మారకం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు చెబుతున్నారు.

శనివారం ముంబై విమనాశ్రయానికి వచ్చిన ఆనంద్‌ను పుణె పోలీసులు అదుపులోకి తీసుకుని అదనపు సెషన్స్ కోర్టు జడ్జి  కిశోర్ వదానే ఎదుట హాజరు పరిచారు. ఆనంద్ అరెస్ట్‌పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 11 వరకు ఆయనను అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ చట్టవ్యతిరేకమని, వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించారు.  అయితే, ఆనంద్ పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను సెషన్స్ కోర్టు కొట్టివేయడం వల్లే తాము ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వివరణ ఇచ్చారు.
professor anand teltumbde
Koregaon Bhima Case
anticipatory bail
pune police

More Telugu News