Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభం

  • ఈ నెల 15 వరకు కొనసాగుతుంది
  • ఆహుతైన స్టాల్స్ స్థానంలో కొత్త వాటిని నిర్మిస్తాం
  • మరో రెండ్రోజుల్లో నిర్మించి నిర్వాహకులకు అప్పగిస్తాం

హైదరాబాద్, నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలు స్టాల్స్ అగ్నికి ఆహూతయ్యాయి. ఎగ్జిబిషన్ ని తిరిగి ప్రారంభించామని, ఈ నెల 15 వరకు కొనసాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ రంగారెడ్డి పేర్కొన్నారు. ఆహుతైన స్టాల్స్ స్థానంలో కొత్త వాటిని మరో రెండ్రోజుల్లో నిర్మించి నిర్వాహకులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనలో అగ్నికి ఆహుతైన మూడొందల స్టాల్స్ లో 130 మంది బాధితులకు రూ.35 వేలు చొప్పున అందజేశామని అన్నారు. ఎగ్జిబిషన్ లో ప్రమాద ఘటనపై ఓ కమిటీ వేశామని, నివేదిక ఆధారంగా బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News