SIMI: సిమి ఉగ్రవాదులతో లౌకిక వాదానికి ప్రమాదం...అందుకే నిషేధం: కేంద్ర హోంశాఖ

  • ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియాపై మరో ఐదేళ్లపాటు ఆంక్షలు
  • కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ జారీ
  • 2014లో తొలిసారి నిషేధం

ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమి) ఉగ్రవాదులు భారత లౌకిక వాదానికి ప్రమాదకర శత్రువులని, అందుకే వారిపై మరో ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ భద్రతకు ముప్పువాటిల్లేలా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. సిమీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు తీసుకోకుంటే పరారీలో ఉన్న తమ సభ్యులను ఆ సంస్థ తిరిగి తీసుకు వస్తుందని, వారు జాతి వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేసి లౌకివాదాన్ని దెబ్బతీస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మత విద్వేషాలను ప్రేరేపిస్తూ సిమి గతంలో పలు ఉగ్రదాడులకు పాల్పడింది. 2014లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, 2017 ప్రాంతంలో గయలో పేలుళ్లకు పాల్పడింది. తెలంగాణ రాష్ట్రంలోనూ పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు. దీంతో 2014 ఫిబ్రవరి 1న అప్పటి యూపీయే ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఇప్పుడు మళ్లీ పొడిగించారు.

More Telugu News