Krishna District: ప్రేమ పేరిట బాలికను తీసుకుపోయిన కానిస్టేబుల్... ఫోక్సో చట్టం కింద కేసు పెట్టిన కృష్ణా పోలీసులు!

  • ఇంటర్ చదువుతున్న కానూరు బాలిక
  • పడమట పీఎస్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ హరి
  • మాయమాటలు చెప్పి తీసుకుపోయిన హరి
కృష్ణా జిల్లా కానూరుకు చెందిన ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను తీసుకుని, ఓ కానిస్టేబుల్ అదృశ్యం కావడంపై, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపగా, సదరు కానిస్టేబుల్ పై ఫోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌ లో బండి హరి అనే యువకుడు కానిస్టేబుల్ గా విధుల్లో ఉన్నాడు. కానూరుకు చెందిన బాలిక (17) కాలేజీలో చదువుతుండగా, ప్రేమిస్తున్నానంటూ ఆ బాలికకు మాయమాటలు చెప్పాడు. కాలేజీకి వెళ్లిన ఆమెను హరి తీసుకెళ్లిపోయాడని, తన కూతురి జాడను కనుక్కోవాలని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, నిందితుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
Krishna District
Vijayawada
Police
Minor Girl

More Telugu News