USA: మరిగే నీటిని గాల్లోకి విసిరితే... పోలార్ వోర్టెక్స్ ప్రభావం ఇది... వీడియో!

  • అమెరికాలో మైనస్ 50 డిగ్రీలకు ఉష్ణోగ్రత
  • ప్రయోగాలు చేసి మురిసిపోతున్న ఔత్సాహికులు
  • అరక్షణంలో మంచుగా మారిన వేడి నీరు

మరిగిపోతున్న నీటిని ఓ గిన్నెలో తీసుకుని గాల్లోకి విసిరితే... ఆ పని చేయడానికే భయపడతాం. ఎందుకంటే ఒక్క చుక్క శరీరంపై పడ్డా కాలిపోతుంది కాబట్టి. కానీ, ఈ వీడియోను చూస్తే మీ ఆలోచన మారిపోతుంది. అమెరికాను పోలార్ వోర్టెక్స్ తీవ్ర ఇబ్బందులు పెడుతూ, మైనస్ 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోగా, పలువురు ఈ తరహా ప్రయోగాలు చేస్తూ, తమ సరదాలు తీర్చుకుంటున్నారు. గడ్డకట్టించే చలి ఎముకలు కొరికేస్తున్న వేళ, మరుగుతున్న నీటిని గాల్లోకి విసిరగా, ఆ నీరంతా అర క్షణంలో మంచుగా మారిపోయి, ఓ మేఘం మాదిరిగా వెళ్లిపోయింది. ఈ తరహా వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అటువంటి వీడియోల్లో ఒకటి మీరూ చూడవచ్చు.

More Telugu News