vote on account budjet: కేంద్రం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు

  • మనోహర్‌లాల్‌ శర్మ అనే న్యాయవాది పిటిషన్‌
  • రాజ్యాంగంలో తాత్కాలిక బడ్జెట్‌ పదం లేదన్న పిటిషనర్‌
  • కేంద్రం తీరును తప్పుపట్టిన వైనం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై విపక్షాల నుంచేకాక ఇతరుల నుంచి కూడా విమర్శలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌పై మనోహర్‌లాల్‌ శర్మ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. రాజ్యాంగ నిబంధనకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. అసలు రాజ్యాంగంలో ‘తాత్కాలిక బడ్జెట్‌’ అన్న ప్రస్తావనే లేదని, అటువంటప్పుడు తాత్కాలిక బడ్జెట్‌ ఎలా ప్రవేశపెడతారని పిటిషనర్‌ ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News