Manchu Manoj: శ్రీ వెంకటేశ్వరుడు ఊరుకోడు... మోదీని టార్గెట్ చేస్తూ మంచు మనోజ్ ఘాటు వ్యాఖ్యలు!

  • మీ పోరాటంలో మేం అండగా ఉన్నాం
  • హామీలు నెరవేరుస్తారని నాలుగేళ్లు చూశాం
  • ట్విట్టర్ లో మంచు మనోజ్
తిరుపతి కేంద్రంగా పనిచేస్తూ, రాయలసీమలో ప్రజలకు సేవ చేస్తానంటూ, ఇటీవలి కాలంలో పలుమార్లు వ్యాఖ్యానించడం ద్వారా, తనకు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని చెప్పకనే చెబుతున్న మంచు మనోజ్, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెడుతూ, తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు మోదీని క్షమించడని అన్నారు.

"మీకు మా అవసరం ఉన్న సమయంలో మీకు అండగా నిలిచాము. మీరు చేస్తున్న పోరాటంలో మీ వెంటే నిలిచాం. నాలుగేళ్లు మీకు మద్దతిచ్చాం. హామీలను నెరవేరుస్తారని చూశాం. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా కాదు కదా... కనీసం మీలో కృతజ్ఞతాభావం కూడా లేకపోయింది. మా డిమాండ్ ను గుర్తించి ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వండి. లేకుంటే, మీరు ఎవరి సన్నిధిలో అయితే ఆ ప్రమాణం చేశారో, ఆ బాలాజీ ఆగ్రహానికి గురికాక తప్పదు" అని ఘాటు ట్వీట్ పెట్టారు.
Manchu Manoj
Twitter
Narendra Modi

More Telugu News