అమెరికాలో భారతీయ విద్యార్థుల విడుదలకు తక్షణ చర్యలు చేపట్టాలి: పవన్ కల్యాణ్
- విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు
- విద్యార్థులకు అవసరమైన సాయం అందించాలి
- ఎన్నారై జనసేన ప్రతినిధులకు విజ్ఞప్తి
అమెరికా ప్రభుత్వమే మిచిగన్ రాష్ట్రంలో నకిలీ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి, విద్యార్థులను ట్రాప్ చేసి అందులో చేరిన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం విచారకరమని ఆరోపించారు. ఈ విషయంలో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అవసరమైన సాయాన్ని అందించాలని ఎన్నారై జనసేన ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కళాశాల దశ నుంచే అవగాహన శిబిరాలను నిర్వహించాల్సిన బాధ్యతను విద్యా శాఖతోపాటు కళాశాలలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.