interim budget: దేశ ప్రజలకు నిరాశ.. ఏపీ ప్రజలకు డబుల్ నిరాశ: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

  • బీజేపీ నినాదం ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’
  • ఈ బడ్జెట్ ‘సబ్ కా నిరాశ్
  • ఈ బడ్జెట్ లో కౌలు రైతులకు నిరాశే ఎదురైంది

బీజేపీ నినాదం ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ కానీ, ఈరోజు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ చూస్తే ‘సబ్ కా నిరాశ్’ అన్న తీరుగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈ బడ్జెట్ తో దేశ ప్రజలకు నిరాశ ఎదురైతే, ఏపీ ప్రజలకు డబుల్ నిరాశ ఎదురైందని అన్నారు.

ఈ బడ్జెట్ పై ప్రజలు ఊహించిన దానికి, వాస్తవానికి చాలా అంతరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతు సాయం కింద కేంద్రం రూ.6000 ఇస్తామంటోందని, నెలకు చూస్తే రూ.500, రోజుకు రూ.17 చొప్పున రైతు కుటుంబానికి దక్కుతుందని, ఇది వాళ్లను చాలా నిరాశకు గురిచేసిందని అన్నారు.

ఈ బడ్జెట్ లో కౌలు రైతులకు, ఆదాయ పన్ను పరిమితిని రూ.8 లక్షలు చేస్తారని భావించిన మధ్యతరగతి ప్రజలకు, చిన్న వ్యాపారులకు నిరాశే ఎదురైందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకొస్తే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు చేస్తామని ప్రకటించామని, తాజాగా, తాము అధికారంలోకొచ్చిన రాష్ట్రాల్లో రుణమాఫీ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

More Telugu News