pranay: పోలీసులు, మీడియా వల్లే మా కుటుంబం ఈరోజు బతికుంది: ప్రణయ్ తండ్రి బాలస్వామి

  • దేవుడి దయ వల్ల మా కోడలు, మగ బిడ్డ క్షేమం 
  • ఎవరికంట పడకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాం
  • ప్రణయ్ హత్య తర్వాతా మాపై వేధింపులు కొనసాగాయి
ప్రణయ్ భార్య అమృతకు మగ శిశువు పుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ, ఆ దేవుడి దయ వల్ల తన కోడలు, మగ శిశువు క్షేమంగా ఉన్నారని అన్నారు. తమ కోడలు ఆరోగ్యం, ఆమెకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా నెలరోజుల క్రితం హైదరాబాద్ వచ్చామని అన్నారు. ఈ నెల రోజులు కూడా ఎవరికంట పడకుండా చాలా జాగ్రత్తగా, పోలీసుల రక్షణలో ఉన్నట్టు చెప్పారు. పోలీసులు, మీడియా వల్లే తమ కుటుంబం ఈరోజు బతికుందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఏడాది పాటు తమ కుటుంబం ఎంతో వేదన అనుభవించిందని, ప్రణయ్ హత్య తర్వాత కూడా తమపై వేధింపులు కొనసాగాయని చెప్పుకొచ్చారు. తమ కోడలు అమృతను కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న విషయాన్ని చెప్పారు.  
pranay
amrutha
balaswamy
Hyderabad

More Telugu News