Andhra Pradesh: ఏపీకి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించింది: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • ప్రత్యేక హోదా, రైల్వేజోన్ల గురించి ప్రస్తావించలేదు
  • ‘పోలవరం’ కు అదనపు నిధులు ప్రకటించలేదు
  • ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించకపోవడం బాధాకరం

లోక్ సభలో 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి పీయుష్ గోయల్ ఈరోజు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశం అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ, ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు లేకపోవడం నిరాశకు గురిచేసిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ల గురించి ప్రస్తావించలేదని, పోలవరం ప్రాజెక్ట్ కు అదనపు నిధులు ప్రకటించలేదని విమర్శించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించిన ప్రస్తావన చేయకపోవడం బాధాకరమని విజయసాయిరెడ్డి అన్నారు.   

  • Loading...

More Telugu News