మధ్య తరగతికి మోదీ వరం.. ఆదాయపన్ను పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు!
- రూ.6.5 లక్షల వార్షిక వేతన జీవులకూ ఊరట
- సేవింగ్స్ లో పెట్టుబడులు పెడితే పన్ను నుంచి మినహాయింపు
- లబ్ధి పొందనున్న 3 కోట్ల మంది ఉద్యోగులు
అలాగే సంవత్సరానికి రూ.6.5 లక్షల ఆదాయం అందుకుంటున్న వ్యక్తులు ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్, ప్రభుత్వ సేవింగ్స్, ఇన్సురెన్స్ పథకాల్లో పెట్టుబడులు పెడితే ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు వస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల 3 కోట్ల మంది మధ్యతరగతి వారికి ఊరట కలుగుతుందని గోయల్ తెలిపారు.
ఉద్యోగులు, సిబ్బందికి ఈ నిర్ణయం వల్ల రూ.18,500 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. కాగా మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట ప్రకటించిన నేపథ్యంలో పార్లమెంటులో బీజేపీ సభ్యులు మోదీ.. మోదీ.. మోదీ అంటూ నినాదాలతో, బల్లలు చరుస్తూ హోరెత్తించారు. దీంతో ప్రధాని చిరునవ్వులు చిందించారు.