Telangana: వేములవాడ రాజన్నకు 18 కేజీల బంగారం.. ఎస్బీఐలో జమ చేసిన ఆలయవర్గాలు!

  • ఏడేళ్ల కాలంలో భక్తుల అందజేత
  • తూకం వేసి ఎస్బీఐలో డిపాజిట్ 
  • కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ, ఆలయవర్గాలు

తెలంగాణలోని వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో డిపాజిట్ చేశారు. భక్తులు ఇచ్చిన 18 కేజీల 360 గ్రాముల బంగారాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో తూకం వేశారు. రాష్ట్రంలోని ఆలయాలకు అందే బంగారాన్ని బ్యాంకుల్లో జమ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

2009 నుంచి 2015 వరకూ ఆలయానికి బంగారం రూపంలో భక్తులు ఇచ్చిన బహుమతులను ఎస్బీఐలో జమ చేసినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ వేసిన కమిటీ సభ్యులు, అడిషనల్ కమిషనర్, ఇంచార్జీ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు, జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి అంజన్నదేవీ, ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.

  • Loading...

More Telugu News